బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా మంచి అవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు & అర్హతలు
పోస్టు పేరు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO)
మొత్తం ఖాళీలు: 2,482
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్ (80), తెలంగాణ (50) - మొత్తం: 130
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ. అదనంగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం ఒక సంవత్సరం పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి.
వయోపరిమితి: ఆగస్టు 1, 2026 నాటికి 21 నుండి 30 సంవత్సరాలు. (నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు సడలింపు ఉంటుంది).
జీతం: నెలకు రూ.48,480 నుండి రూ.85,920 + అలవెన్సులు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: రూ.850; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలు: రూ.175.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ.
పరీక్షా విధానం: మొత్తం 120 మార్కులకు 120 ప్రశ్నలు (ఇంగ్లీష్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్/ఎకనామిక్ అవేర్‌నెస్, రీజనింగ్ & ఆప్టిట్యూడ్). ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 18, 2026
చివరి తేదీ: సెప్టెంబర్ 7, 2026
ఈ నియామకాల్లో తెలుగు రాష్ట్రాలకు కూడా పోస్టులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 80 పోస్టులు, తెలంగాణలో 50 పోస్టులు ఉన్నాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 130 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
Rajatheertha follows strict editorial standards. If you have corrections, updates or editorial queries, contact our desk.
Submit an Editorial Correction →




