
105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో ఊరట: హత్య కేసులో జీవిత ఖైదు రద్దు!
1988 నాటి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 105 సంవత్సరాల రసిక్ చంద్ర మొండల్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఆయన వయోభారాన్ని పరిగణనలోకి తీసుకుని మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది.



