పాలు అమ్మిన .. పూలు అమ్మిన .. స్కూల్ పెట్టిన.. కాలేజీ పెట్టిన సక్సెస్ ఐన .. పోలిటిషన్ ఐన అని ఎప్పుడు ట్రెండ్ ని సెట్ చేస్తూ సోషల్ మీడియా లో హంగామా చేసే మన మల్లారెడ్డి సర్ కాలేజీ మీద కేసు ఐయింది ఎరికేనా మీకు ? ప్రముఖ నటుడు రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగింది. ఈ ఈవెంట్‌లో ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే.
మల్లారెడ్డి కాలేజీలో 'టాక్సిక్' ఈవెంట్ ప్రమాదం
ప్రముఖ నటుడు రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిన్న (శనివారం) జరిగింది. ఈ ఈవెంట్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం మధ్యలో ఉన్నట్లుంది ఒక్కసారిగా భారీ ఫ్లడ్ లైట్ స్థంభం కిందపడిపోయింది. స్థంభం పై పడటంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందగానే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
నిర్లక్ష్యమే కారణం - పోలీసుల కేసు నమోదు
ఈ ఘటనకు కారణమైన మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్లారెడ్డి కళాశాలలో టాక్సిక్ వ్యవహారానికి సంబంధించి ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ ఈవెంట్‌లో తొక్కిసలాట జరగటంతో పలువురికి గాయాలయ్యాయని చెప్పారు. టాక్సిక్ చిత్ర యూనిట్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
మా మాట
ఐన మల్లారెడ్డి సర్ చదువుకునే సొట ఈ సినిమా ఈవెంట్ ఏందీ.. మూవీ ప్రొమోషన్ కి సినిమా వాళ్ళు ఏమైనా ముడుపులు ఇస్తున్నారా ఏందీ ? జెర్ర బంజేయిర్రి .. ఈ ఈవెంట్లు .. లీడర్స్ అంటే నలుగురికి చెప్పే వాళ్ళు మీరు అందరికి ఆదర్శంగా ఉండాలే గాని.. సినిమా అంటే జెర్ర పోరగాళ్ళకు జేర్రంత హుషారు ఉందది గానీ ఆ పిల్లలకు ఏమైనా ఐతే వాళ్ళ కుటుంబాలు ఎం గావాలె జెర్ర జెప్పుర్రి సారూ ..
Rajatheertha follows strict editorial standards. If you have corrections, updates or editorial queries, contact our desk.
Submit an Editorial Correction →




